Home / SLIDER / సీఎం కేసీఆర్ పై స్టార్ హీరోయిన్ ప్రశంసల వర్షం ..

సీఎం కేసీఆర్ పై స్టార్ హీరోయిన్ ప్రశంసల వర్షం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా అమలు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్నలను పొందటమే కాకుండా రాష్ట్రాల సరిహద్దులను దాటి దేశ వ్యాప్తంగా పలువురి ప్రశంసలను అందుకుంటున్న సంగతి తెలిసిందే .తాజాగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పై ప్రశంసల వర్షం కురిపించారు .

తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున బచావో బేటీ పడావో కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితురాలైన సందర్భంగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ సందర్భంగా ఈ పంజాబీ బ్యూటీ మాట్లాడుతూ “రాష్ట్రంలో మహిళల కోసం బాలికల కోసం సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది .మహిళల శ్రేయస్సు కోసం సర్కారు పనిచేస్తోన్న తీరు భేష్ .

షీటీమ్స్ మొదలు గర్భిణి స్త్రీలకు కేసీఆర్ కిట్ పథకం వరకు అన్నిటిని సర్కారు అమలు చేస్తోన్న తీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి  అని ఆమె కొనియాడారు .బాలబాలికల, మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నపలు కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలలో అమలు చేయడానికి ఆయా ప్రభుత్వాలు చొరవ చూపడం ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనం ..అలాంటి రాష్ట్రానికి బచావో బేటీ పడావో కార్యక్రమానికి ప్రచారకర్తగా నియామకం కావడం నా అదృష్టం అని అన్నారు .