తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అమీర్‌పేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం జరిగింది. అమీర్‌పేట కనకదుర్గ ఆలయం వద్ద రహదారి నిర్మాణం పనులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అమీర్‌పేటలో రూ. 25 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు జరగనున్నాయి.
ఎస్‌ఆర్‌నగర్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3.28 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం పనులు జరగనున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ గుడి వద్ద రూ. మూడు కోట్లతో చేపట్టిన పార్కింగ్ పనులకు శంకస్థాపన చేశారు. పటేల్‌నగర్ శ్మశాన వాటికలో రూ.2 కోట్లతో చేపట్టనున్న పనులు ప్రారంభించారు. ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగింది.
55 ఏళ్లు ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలనను తప్పు పడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయరు. టీఆర్‌ఎస్ పార్టీకి బాస్‌లు ఢిల్లీలో లేరు. మా బాస్‌లు గళ్లీల్లోనే ఉన్నరు. మీరే మా బాస్‌లు, మీ మాటే వింటామని ప్రజలను ఉద్దేశించి తెలిపారు