తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని బీసీలకు కానుక ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ.102.8 కోట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రంపై శుక్రవారం సీఎం సంతకం చేశారు. ఈ రుణాల వల్ల 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది.
ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల హర్షం వ్యక్తం చేశారు .రాయితీ రుణాల నిధుల మంజూరు పట్ల తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, రోడ్డు,రవాణ, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తంచేశారు. 12 ఫెడరేషన్స్ లబ్ధిదారులకు సత్వరమే రాయితీ రుణాలిస్తామని వారు తెలిపారు.