తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నారు .ఇప్పటికే ఆయన టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆయన మరోసారి ట్విస్ట్ ఇచ్చారు .ఇటీవల గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న దగ్గర నుండి ఇప్పటివరకు తెలుగు తమ్ముళ్ళు ఎవరు ఖండించకపోగా కనీసం ఒక్క విమర్శ కూడా చేయలేదు .తాజాగా రేవంత్ వ్యాఖ్యల ప్రకంపలపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది .ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకు చెందిన టీడీపీ నేతలందరూ హాజరయ్యారు .అయితే ఈ సమావేశానికి రేవంత్ హాజరుకారేమో అని భావిస్తున్న తరుణంలో అందరికి షాక్ ఇస్తూ ఆయన సమావేశానికి హాజరయ్యారు .
