Home / POLITICS / రేవంత్ కోసం ఎక్స్ ట్రా జబరదస్త్ ను మించి కామెడీ చేస్తోన్న టీ కాంగ్రెస్ నేతలు ..

రేవంత్ కోసం ఎక్స్ ట్రా జబరదస్త్ ను మించి కామెడీ చేస్తోన్న టీ కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి .ఈ వార్తలపై అటు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఖండించలేదు ..అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారడం ఏమో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్ ను మించి కామెడీ చేస్తోన్నారు .

ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ స్పందిస్తూ రేవంత్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం ..ఆయన రాకతో మా పార్టీ బలం పెరుగుతుంది అని అన్నారు .మరోవైపు మూడు సార్లు ఎంపీగా పనిచేసిన సోనియామ్మకు ప్రియ శిష్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హన్మంతరావు మాట్లాడుతూ అందరం కలిస్తేనే అధికారం ..ఆయన చేరితే పార్టీలో జోష్ పెరుగుతుంది అని అన్నారు .

మరోవైపు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ రేవంత్ పార్టీలోకి రావడం వలన ప్ల‌స్ పాయింట్‌ గా మారుతుంది .తమ పార్టీ భవిష్యత్తు కోరేవారు ఆయన రాకను విస్మరించరు..అంతే కాదు ఆయన వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం అని అన్నారు .ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టి ఇలా ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తూ ఎక్స్ ట్రా జబరదస్త్ ను మించి కామెడీ చేస్తోన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat