ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం త్వరలో వైసీపీలో చేరనున్నారు .రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు .
గత కొంత కాలంగా కోట్ల కుంటుంబం త్వరలో వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే .ప్రస్తుతం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ,ఆయన కొడుకు రాఘవేంద్రరెడ్డి, భార్య సుజాతమ్మ ఈ నెల 30న వైసీపీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .దీంతో మున్సిపల్ ఎన్నికలు గనుక జరిగితే కోట్ల రాఘవేంద్రరెడ్డి కర్నూలు మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.
అలాగే, సుజాతమ్మ వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. సూర్యప్రకాశ్ రెడ్డి మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం .దీంతో జిల్లాలోని కర్నూలు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కోట్ల కుటుంబానికి మంచి పట్టుంది.అంతే కాకుండా రాయలసీమలో మంచి పట్టున్న కోట్ల ఫ్యామిలీ వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తీవ్రంగా నష్టపోవడం కావడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ..