తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది .అందుకు తగ్గట్లే ఇటు టీడీపీ పార్టీకి చెందిన నేతలు రేవంత్ రెడ్డి పై ఎదురుదాడికి దిగుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున నేతల మద్దతు రేవంత్ రెడ్డికి క్రమక్రమంగా పెరుగుతుంది .
ఈ నేపథ్యంలో ఇటీవల దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేశారు .ఇప్పుడు ఈ ఫ్లెక్సీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తోన్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొందరు రేవంత్‌రెడ్డి ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలో పెట్టేశారు. రేవంత్‌రెడ్డి చిత్రంతో పాటు కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి, స్థానిక నేతలతో కూడిన ఈ ఫ్లెక్సీని కృష్ణారెడ్డి, సాంబరాజులు ఏర్పాటు చేయడం గమనర్హం .