జనసేన పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది .రాష్ట్ర విభజన సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే .
తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పలు టీవీ ఛానల్స్ లో నిర్వహించే పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్న కళ్యాణ్ సుంకర ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పోలీసులు అరెస్ట్ చేశారు .ఒక వ్యక్తిని మోసం చేశాడు అనే కారణంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు .
అసలు విషయానికి వస్తే ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్ లో ఐఫోన్ 7 ను అమ్మకానికి పెట్టిన సుంకర ఒరిజినల్ ఫోన్ బదులు డమ్మీ ఫోన్ ను సదరు వ్యక్తికీ అమ్మాడు .దీంతో ఆ ఫోన్ కొన్న వ్యక్తీ అది డమ్మీ ఫోన్ .ఎందుకు ఇలా చేశావు అని సదరు వ్యక్తీ సుంకరను నిలదీశాడు .దీంతో కళ్యాణ్ సుంకర తన దగ్గర ఉన్న ఎయిర్ గన్స్ తో అతన్ని బెదిరించాడు .దీంతో సదరు వ్యక్తీ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు.