పార్టీ మారబోనంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు . తాను పార్టీ మారడం లేదంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో ఏమాత్రం స్పష్టత లేదని రమణ అన్నారు. .. కాంగ్రెస్ నేతలను కలిశారన్న వార్తలను రేవంత్ ఖండించాలన్నారు. తమ పార్టీ నేతలను రేవంత్ కలిసినట్టు కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని, ఈ క్రమంలో రేవంత్ ఏం చెబుతారని ప్రశ్నించారు. మీడియాలో వస్తున్న వార్తలతో టిటిడిపి, క్యాడర్ ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. వ్యక్తులపై వస్తున్న ప్రచారంపై వాళ్లే స్పషమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఇతర పార్టీ నేతలను కలిసిన వారి జాబితాను అధినేత చంద్రబాబుకు అందజేస్తామని రమణ చెప్పారు.