సిద్దిపేట ప్రాంతానికి వరంగా ఇచ్చిన మెడికల్ కళశాల కు ఈరోజు కేబినెట్ మరో వరం ఇచ్చింది..వైద్య కలశాలకు అవసరమగు 930 వైద్యుల నియామకానికి ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం ఇచ్చారని మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా వెల్లడించారు…సిద్దిపేట జిల్లా కు వైద్య కళశాల ఒక వరం అని మంజూరు అయినప్పటికీ నుండి పనుల్లో ,ఇటు వైద్యులు నియామకం లో వేగవంతంగా జరుగుతున్నాయి అన్నారు..జిల్లా ఏర్పాటు అయ్యాక వైద్య రంగం లో ఒక విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు…జిల్లాలో నియోజకవర్గ కేంద్రం మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు చేశానని ఇటీవల 50పడకల ఆసుపత్రిలను చేసుకున్న హుస్నాబాద్ ,నంగునూర్ అదేవిధంగా గజ్వెల్ ,దుబ్బాక 100 పడకల ఆసుపత్రి లలో నూతనంగా వైద్యుల పోస్టుల మంజూరు కి కేబినెట్ ఆమోదం పొందినది అని మంత్రి హరీష్ రావు గారు తెలిపారు….దీనితో ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యుల కొరతకు ఇక్కట్లు తిరునున్నాయని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిల పై నమ్మకం పెరిగింది అందుకు సీఎం కేసీఆర్ గారు ,కేబినెట్ సుదీర్ఘ చర్చ జరిగింది అని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టనున్నట్లు అన్నారు…వైద్య కళాశాల కు 930 పొస్థులు ,జిల్లా లో ఆసుపత్రి లో వైద్యుల పోస్టుల కు కేబినెట్ ఆమోదం ,మంత్రి వర్గం లో ప్రస్తావించడం పై మంత్రి హరీష్ రావు గారు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ,ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి గారికి ,సహకరించిన కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు…..
