తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన దృష్టికి వచ్చే ప్రజా సమస్యల విషయంలో ఎంత చురుకుగా, దయా హృదయంతో స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా…సమస్య ఇంకేదైనా మంత్రికి చేరవేయాలనుకుంటే ఎవరినో ఆశ్రయించి దరఖాస్తులు రాసి…క్యూలల్లో నిల్చొని వాటిని అందించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ట్వీట్ చేస్తే చాలు. అది కూడా బాధితులే కావాల్సిన అవసరం లేదు.
అలా ఓ ముసలవ్వ గోసను చూసి ఓ పౌరుడు స్పందించారు. మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను చేరవేశాడు. దీంతో ఆ అవ్వకు గూడు దొరికింది. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ చౌరస్తాలో ఓ వృద్ధురాలు నీడ కోసం ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన ఓ నెటిజన్ ఫోటో దింపి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా పంపించి ఆమెకు సహాయం చేయాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి..ఆమెను ఆదుకోవాలని సూచించారు.
దీంతో రంగంలో దిగిన జీహెచ్ఎంసీ ఆ పండు ముసలిని అక్కడి నుంచి ప్రభుత్వ వసతి గృహానికి తరలించి ఆమెకు గూడు కల్పించారు. ఇదే విషయాన్ని మంత్రికి, సదరు నెటిజన్‌కు చేరవేశారు. మంత్రి దయాహృదయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
@KTRTRS sir please shift this lady also to night shelter. She'll be found at Masabtank signal. I've seen her so many times risking her life. pic.twitter.com/8VYVyFAeQY
— Kiran Chevella (@KiranChevella) October 23, 2017
Please do the needful @GHMCOnline @CommissionrGHMC @KTRoffice https://t.co/KLQLTypRXs
— KTR (@KTRTRS) October 23, 2017
The old woman has shifted to the #GHMC night shelter at Golnaka by @zccz_ghmc and team. pic.twitter.com/JMkuiL1vcy
— GHMC (@GHMCOnline) October 23, 2017