తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో యువకులే కీలక పాత్ర పోషించాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు…సిద్దిపేట మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన 40మంది బీజేపీ యువకులకు మంత్రి హరీష్ రావు గారు తెరాస పార్టీలోకి స్వాగతం పలికారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అని…నిరుద్యోగ యువతి యువకులకు భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం అని..సిద్దిపేట లో నిరుద్యోగులకు పోటీ పరీక్షల కొరకు ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేశామన్నారు…
పార్టీ బలోపేతానికి ,ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీస్కుఎల్లడం లో యువత కీలక పాత్ర పోషించాలి అని అన్నారు…సిద్దిపేట నియోజకవర్గం అన్ని ఆరంగాల్లో అభివృద్ధి చెంది రాష్ట్రంలో నే ఆదర్శంగా నిలుపుతున్నాం అన్నారు…తెరాస పార్టీ యువతను అన్ని విధాలుగా కపాడుకుంటాం అని..పార్టీ కార్యక్రమంలో… గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడం లో యువత ముందు ఉండాలి అని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు….
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ టౌన్ జాయింట్ సెక్రెటరీ తో పాటు బీజేఎంవై మండల నాయకులు ,రేణిగుంట నగేష్ బీజేఎంవై గ్రామ శాఖ అధ్యక్షులు, పంది నగేష్ యూత్ అధ్యక్షులు ,పంది శ్రవణ్ గ్రామ ఉపాఢ్యక్షులు ,రేణిగుంట రంజిత్ ,సంపగి శ్రీకాంత్ తదితరులు మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీ లో చేరారు….సీనియర్ నాయకులు శ్రీనివాస్ రావు ,జడ్పీటీసీ యాదయ్య ,మారెడ్డి రవీందర్ రెడ్డి గారు ,శ్రీహరి గారు ,ప్రవీణ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు…