Home / SLIDER / స్వరాష్ట్రంలో మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు

స్వరాష్ట్రంలో మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని సీఎం కేసీఆర్  కోరారు. మైనారిటీల సంక్షేమంపై ఈ రోజు  హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీల కోసం ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

‘‘ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మైనారిటీల్లో ముస్లింలే ఎక్కువ. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనారిటీల్లో అత్యంత పేదరికం ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే మైనారిటీల జీవితంలో వెలుగు వస్తుందని నేను ఉద్యమ సమయంలోనే అనేక మార్లు చెప్పాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కూడా మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. చాలా కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీల  నిధులు ఎలా ఖర్చు చేస్తున్నామో మైనారిటీల కోసం పెట్టే ఖర్చును కూడా అలాగే ఖర్చు చేయాలి. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ ఒక్క వర్గం వెనుకబడిపోయినా అది సంపూర్ణ ప్రగతి కాదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇవే:

  • ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ కార్యక్రమంలో ఖచ్చితంగా మైనారిటీలు లబ్ధి పొందే విధంగా కార్యాచరణ ఉండాలి.
  • పేద మైనారిటీ యువకుల స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించాలి. లక్ష, రెండు లక్షలు, రెండున్నర లక్షల రూపాయల విలువైన యూనిట్ల కోసం ఆర్థిక సహాయం అందించాలి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలి.
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో పది శాతం మైనారిటీలకు దక్కేలా చర్యలు తీసుకోవాలి.
  • అర్బన్, సెమీ అర్బన్, కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో మైనారిటీల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. దానికి అనుగుణంగానే కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలి.
  • పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూ టీచర్ల పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఖాళీలున్నాయి? ఇంకా ఎన్ని కావాలి? తదితర వివరాలు సేకరించి భర్తీ చేయాలి.
  • మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డు మరింత సమర్థ వంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
  • రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ లు ఇంగ్లీషు, తెలుగుతో పాటు ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలి.
  • హైదరాబాద్ నగర పరిధిలో ముస్లింల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడను, ప్రత్యేక ఐటి కారిడార్ ను అభివృద్ధి చేయాలి.
  • హైదరాబాద్ కోకాపేటలో పది ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలి. మూడు వారాల్లోగా నిర్మాణ పనులు మొదలు కావాలి.
  • దేశంలోనే చార్మినార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్ కు వచ్చే ప్రతీ పర్యాటకుడు చార్మినార్ చూడాలనుకుంటారు. దీనికి తగినట్లుగా చార్మినార్ వద్ద ఏర్పాట్లుండాలి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి. పర్యాటకులు చార్మినార్ వద్ద సులభంగా గడపడం కోసం ఏర్పాట్లు చేయాలి. అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్ అభివృద్ధి చేయాలి.
  • 42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతాన్ని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేయాలి. పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ లతో పాటు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా నిర్మించాలి. మూసీ నది వెంట మెట్రోరైలు/నానో రైలు నడపడానికి ఏర్పాట్లు చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలి.
  • హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో వివిధ అత్యవసర పనులు చేయడం కోసం ఎస్.డి.ఎఫ్. నుంచి రూ.40 కోట్లు వెంటనే విడుదల చేయాలి.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కె.టి. రామారావు, ఈటెల రాజెందర్, ఎంపి అసదుద్దిన్ ఓవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దిన్ ఓవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ప్రభుత్వ సలహాదారు ఎ.కె. ఖాన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్ఎండిఎ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ యోగిత, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat