ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .వీరిద్దరూ దాదాపు నలబై నిమిషాలు పాటు పలు విషయాల గురించి చర్చించారు అని సమాచారం .ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థలు గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై జగన్ కు చెందిన సాక్షి పత్రిక ,న్యూస్ ఛానల్ మాత్రం ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్గిస్తుంది .
ఈ క్రమంలో సాక్షి అంత కాకపోయిన టీడీపీ పార్టీకి చెందిన నేతల అవినీతి అక్రమాలపై కథనాలను ప్రచురిస్తుంది .ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్ సీబీఐ విచారణకు ఆరు నెలల్లో ఆరు సార్లు హాజరైతే చాలు అని తీర్పునిచ్చిన సమయంలో వీరిద్దరి భేటీ పలు చర్చలకు దారి తీస్తుంది .
కానీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో పాదయాత్ర నిర్వహించనున్న సందర్భంగా ఈనాడు మీడియా ప్రసారం చేయాల్సింది గా కోరడం జరిగి ఉంటుంది అని టాక్ .అయితే గతంలో టీడీపీ పార్టీకి సపోర్టుగా ఉన్న రామోజీ ప్రస్తుతం న్యూట్రల్ గా ఉంటున్న ప్రస్తుత తరుణంలో ఈ భేటీ భవిష్యత్తులో ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి మరి ..?