పీఎంకేఎస్వై కమిటీ సమావేశం ముగిసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్బగా హరీశ్ రావు మీడియాతో మాట్లడుతూ… ఏఐబీపీ కింద తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు రావాల్సిన రూ. 500 కోట్లను త్వరగా విడుదల చేయాలని కోరినమని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ అధికారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారని చెప్పారు. కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి, సమస్య పరిష్కరిస్తమని నితిన్ గడ్కరీ చెప్పిన్రని హరీశ్ రావు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో రాష్ట్ర బడ్జెట్ పై మరింత భారం పడుతోందన్నారు.
