ఏపీ లో విజయవాడ మహానగర వైసీపీ పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్ధం కావడంలేదు .గతంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా,వైసీపీ మాజీ నేత గౌతమ్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదం ఏర్పడిన సమయంలో తప్పు చేసిన గౌతమ్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.
తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయిన వైఎస్సార్ కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తీరుతో మళ్లీ గౌతమ్ వెలుగులోకి వచ్చాడు .వంగవీటి పై అనవసర వ్యాఖ్యలు చేయడమే కాకుండా వంగవీటి కుటుంబాన్ని అవమానించాడు అనే నెపంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అవినాష్ రెడ్డి ఆయనతో దిగిన ఫొటోలను గౌతమ్ వర్గీయలు ప్రచారం చేస్తుండటంతో రాదా తీవ్ర మనస్థాపం చెందుతున్నారు .
పార్టీ నుంచి గౌతమ్ రెడ్డి సస్పెండ్ అయినప్పటికి ఆయన అనుచరులు మాత్రం పండుగలకు శుభాకాంక్షలు చెబుతూ గౌతమ్ రెడ్డి, జగన్ ఇద్దరి ఫొటోలతో ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ పరిణామంపై రాధా అసంతృప్తిగా ఉన్నారు. కొద్దిరోజులుగా ఆయన వైసీపీ నేతలకు అందుబాటులోకి కూడా రావడం లేదు. దీంతో పరిస్థితి ఎటు దారి తీస్తుందో అర్థం కాక వైసీపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి.