తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బీబీనగర్‌లో బీజేపీ పార్టీ నిర్వహించిన ప్రజా పంచాయతీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. అ సమయంలో బీబీనగర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా బీజేపీ కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన టెంట్ ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో లక్ష్మణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ప్రజలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో లక్ష్మణ్‌కు ప్రమాదం తప్పగా, ఒకరికి గాయాలయ్యాయి.