ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది రోజుల విదేశ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .తన విదేశ పర్యటన కోసం చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలను చూసుకునే బాధ్యత నారా లోకేష్ నాయుడు ,నిమ్మకాయల చిన్నరాజప్ప ,కాల్వ శ్రీనివాస్ ,దేవినేని ఉమా ,కళా వెంకట్రావులకు అప్పజెప్పి వెళ్లారు .దీంతో టీడీపీ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు ,ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణముర్తికి కోపమొచ్చింది .
ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ వ్యవహారాల బాధ్యతను అప్పజెప్పిన ఐదుగురిలో కేవలం అందులో ఒక్కరికే సీనియారిటీ ఉంది .మిగతా నలుగురు మొట్ట మొదటిసారిగా మంత్రి పదవులను చేపట్టారు .వారికంటే అంత తక్కువ నేను .అందుకే నాకు బాధ్యతలు అప్పజేప్పలేదా అని కేఈ తన అనుచవర్గం దగ్గర వాపోతున్నారు అని సమాచారం .గతంలో ఆగస్టు పది హేను నాడు కేఈ జాతీయ జెండాను ఎగరవేయనియ్యకుండా నారా లోకేష్ నాయుడు తీవ్రంగా అవమానించడంతో అప్పట్లోనే ఆయన పార్టీ మారతాడు అని వార్తలు వచ్చాయి .
ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ సీఎంకు బాధ్యతలు అప్పగించడం సాధారణంగా జరుగుతుంది.. కానీ ఇక్కడ మాత్రం తాను పేరుకే డిప్యూటీ సీఎంగా ఉన్నానని కేఈ వాపోతున్నారు. కేఈని పూచికపుల్లలా చంద్రబాబు తీసేయడం ఇదే తొలిసారి కాదు. రెవెన్యూ శాఖను కూడా చూస్తున్న కేఈ ఆధ్వర్యంలోనే నిజానికి భూముల వ్యవహారాలు సాగాలి. కానీ రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో కేఈని పక్కనపడేసి సన్నిహితుడైన నారాయణకు ఆ బాధ్యతలు అప్పటించారు.దీంతో ఆయన పార్టీలో ఉంటూ అవమానాలను ఎదుర్కునే బదులు పార్టీ మారడం ఖాయం అంటున్నారు .చూడాలి మరి కేఈ ఏ నిర్ణయం తీసుకుంటారో ..?