Home / ANDHRAPRADESH / ఆదినారాయణరెడ్డి పై జోగి రమేష్‌ ఫైర్..!

ఆదినారాయణరెడ్డి పై జోగి రమేష్‌ ఫైర్..!

ఆంద్రప్రదేశ్  మంత్రులు నారా లోకేశ్‌, ఆదినారాయణరెడ్డి, ప‍్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు . వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ కార్యాలయంలో  జోగి రమేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి  తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. ఆ రాజీనామా లేఖను స్పీకర్‌కు  ఎప్పుడిచ్చావ్‌. మరి స్పీకర్‌ ఎందుకు ఆమోదించలేదు?. ఆదినారాయణరెడ్డి నీకు దమ్ము, ధైర్యముంటే రాజీనామా ఆమోదింపచేసుకుని ఎన్నికలకు రావాలి.వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తే మీకు భయమెందుకు?. 420 అనగానే ఏపీలో గుర్తుకొచ్చేది చంద్రబాబే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని తప్పులు లేకుండా పలకగలవా లోకేశ్‌. అఆలు, ఏబీసీడీలు రాని లోకేశ్‌ కూడా జగన్‌ను విమర్శించడమా?, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి. మంత్రి దేవినే ఉమకు బహిరంగ లేఖ రాస్తున్నా. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. టైమ్‌, డేట్‌, ప్లేస్‌ చెబితే నేను చర్చకు సిద్ధం. 24 గంటల్లో స్పందించకపోతే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేఖను ఇరిగేషన్‌ కార్యాలయానికి, మీ ఇంటికి పంపుతున్నా.’ అని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat