ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు ,సీనియర్ నేతలు ,జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే .
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాలు ,జగన్ పాదయాత్ర తదితర విషయాల గురించి చర్చిస్తున్నారు .అందులో భాగంగా జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..ప్రస్తుతం ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుల వ్యవస్థను రద్దు చేసారు..
ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ప్రతేకంగా ఒక అధ్యక్షుడిని నియమించిన జగన్ .. అలాగే ప్రతి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక ఇంచార్జిని నియమిస్తున్నారు.. దీంతో పదమూడు జిల్లాల అధ్యక్షులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చేసిన జగన్.. ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటినుంచి పల్లె నిద్ర చెయ్యాలని ఈ సమావేశంలో ప్రకటించారు…