లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న తన కుమార్తె వర్ష ను చూసేందుకు వెళుతున్నాడని సామాచారం . పాదయాత్ర ప్రారంభమైతే, మరో ఆరేడు నెలల పాటు జగన్ విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటారు కాబట్టి, ఈలోగా తన కుమార్తె క్షేమ సమాచారాలను స్వయంగా తెలుసుకోవాలని భావించిన జగన్ , కోర్టు అనుమతి తీసుకుని ఆయన లండన్ బయలుదేరనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రెండు నెలల క్రితం సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో జగన్ స్వయంగా వెళ్లి తన కుమార్తెను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేర్చి వచ్చిన సంగతి తెలిసిందే. లండన్ తో పాటు యూరప్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆయన టూర్ ఉంటుందని సమాచారం.
Post Views: 202