అసెంబ్లీ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభంకానున్నాయి.ఈ క్రమంలో మొదటి రోజు ప్రశ్నోత్తరాల తర్వాత సభ ఆమోదానికి ప్రభుత్వం 9 బిల్లులను ప్రవేశపెట్టనున్నది. వ్యాట్ చట్ట సవరణ, పీడీయాక్ట్ సవరణ, పట్టాదారు పాసుపుస్తకాల సవరణ బిల్లు, గేమీ ఆర్డినెన్సుకు ఆమోదం, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్డినెన్సులకు ఆమోదం, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎక్సైజ్ చట్టాలకు సవరణల బిల్లులను ఆమోదం కోసం సభ లో ప్రవేశపెడుతారు. ఎన్పీడీసీఎల్ 2015-16 వార్షి క నివేదికను, టీఎస్‌టీఎస్ 2015-16 వార్షిక నివేదికను సభ ముందుంచుతారు.
