విశ్వనటుడు కమల్‌హాసన్ మరోసారి తమిళనాడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పనికిరాని ప్రభుత్వం ఉందని.. తొందరలో కుప్పకూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలోని కోసాస్‌థళై నది విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని వల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే రైతులు 1090 ఎకరాలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ఉత్తర చెన్నైలో స్వల్పంగా వర్షంపడినా రోడ్లు వరదలొచ్చినట్లు జలమయం అయిపోతాయి. ఈఏడాది భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే పది లక్షల మంది జీవితాలు అంధకారమైపోతాయి. వంద వాకీ టాకీలు ప్రజల్ని వరదల నుంచి కాపాడగలవు. కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడమే మంచి ప్రభుత్వ లక్ష్యం అని ట్వీట్‌లో పేర్కొన్నారు కమల్‌హాసన్. అయితే కమల్‌హాసన్ పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపైన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.