తెలుగుదేశం పార్టీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పై తెలంగాణ తెలుగుదేశ అద్యక్షుడు ఎల్ . రమణ సంచలన వాఖ్యలు చేసారు . ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 1985లో ఇందిరతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల వెన్నుపోటు పొడిస్తే 2017లో రాహుల్ గాంధీతో కలిసి టీడీపీకి రేవంత్‌రెడ్డి ద్రోహం చేశారని అన్నారు . పార్టీని రేవంత్‌రెడ్డి వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెస్‌తో రేవంత్‌రెడ్డి టచ్‌లో ఉన్న విషయం 6నెలల క్రితమే తెలుసు అని, అన్ని విషయాలు అధినేత చంద్రబాబుకు చెప్పామన్నారు.
ఎవరైనా పార్టీ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని రమణ పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో టీడీపీ సొంతంగా ఎదుగుతుందని, కేసీఆర్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు.
