నిన్న వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో నల్లగొండ జిల్లావాసి నూకల ఉదయ్‌రెడ్డి(హాల్ టికెట్ నెం. 2011211495) సత్తా చాటారు. రాష్ట్రస్థాయి రెండోర్యాంక్ సాధించారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన నూకల వెంకటరెడ్డి, పద్మల కుమారుడైన ఉదయ్ ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ఇంటర్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. అక్కడే శ్రీహిందూ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఉదయ్ డీఎస్పీ కావాలన్న పట్టుదలతో గ్రూప్-1కు స్వతహాగా ప్రిపేరయ్యాడు. గతంలో 2011 నోటిఫికేషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉదయ్ రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు సాధించాడు. అయితే న్యాయపరమైన విషయాలతో అప్పటి ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడి కాలేదు. తదనంతరం నిర్వహించిన ప్రిలిమ్స్‌లోనూ రాష్ట్రస్థాయిలో రెండోర్యాంక్ సాధించి తన లక్ష్యమైన డీఎస్పీగా నియమితులయ్యారు. కుటంబ సభ్యుల ప్రోత్సాహంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు ఉదయ్ తెలిపారు. ఎం.ఫార్మసీ పూర్తి చేసిన అన్నయ్య గౌతంరెడ్డి తోడ్పాటుతోనే తాను రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాననన్నారు.
