టీడీపీ నేత రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన ఎపిసోడ్ మరిన్ని మలుపులు తిరుగుతోంది. రేవంత్ రాజీనామా సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరును ప్రస్తావించడంపై కమళనాథులు భగ్గుమన్నారు. రేవంత్ రాజీనామాను ఆపాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చంద్రబాబుతో మాట్లాడారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై టీడీపీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జోక్యం చేసుకొని…తమ నాయకుడు చంద్రబాబుతో చర్చించలేదని మీడియాకు స్పష్టత ఇచ్చారు.
అనేక సందర్భాల్లో అవసరం లేనప్పటికీ…మీడియా వార్తలపై వివరణ ఇచ్చే టీడీపీ పెద్దలు తమ జాతీయ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసే ఉదంతంపై ఎందుకు స్పందించ లేదని ఆయన ప్రశ్నించారు. మిత్రపక్షం బద్‌నాం అయిపోతున్నప్పటికీ…స్పందించకపోవడం ఆ పార్టీ తీరుకు అద్దం పడుతుందని అసహనం వ్యక్తం చేశారు. కాగా, గతంలోనే బీజేపీలో చేరాలని రేవంత్ రెడ్డి భావించగా… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన ఓటుకునోటు కేసు నుంచిబయటపడాలని బీజేపీ అధిష్టానం సూచించినట్లు వార్తలు వచ్చాయి.
Post Views: 194