టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సీఎం స్పందించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ దళిత సోదరుడు.. ఓపెన్ వర్సిటీలో పని చేసిన వ్యక్తి అని సీఎం తెలిపారు. ఇండియాలో యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీలో ఆయన చేసిన సంస్కరణలను, ప్రతిభను గుర్తించి చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. గత చరిత్రలో ఏపీకి ఎప్పుడూ ఇలాంటి అభినందన రాలేదన్నారు. చక్రపాణిని అభినందించాల్సింది పోయి.. ఆయనను నిందించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో అవకాశం ఉన్నన్ని ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.
