తెలంగాణ టీడీపీ మాజీ నేత రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ తనకు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాకులుంటే వాటిని రేవంత్‌రెడ్డి తీసుకోవచ్చని, ఒకవేళ కాంట్రాక్టులపై కమీషన్ వచ్చినా వాటినీ తీసుకోవచ్చని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లడానికే రేవంత్ తనపై ఆరోపణలు చేశారేమో? అని మీడియాతో అన్నారు.అయితే తెలంగాణ టీడీపీకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి రేపు దేశ రాజధాని ఢిల్లీ లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే.
