తెలంగాణ రాష్ట్ర తిరుమలగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిన్న సోమవారం కేంద్ర మంత్రి సుజనాచౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని.. అష్టోత్తర పూజలు, స్వర్ణపుష్పార్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మహదాశీర్వచనం జరిపి స్వామివారి శేషవసా్త్రలను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిమాన్విత యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి చేయడం బృహత్తర కార్యక్రమమని కొనియాడారు.
యాదాద్రి ఆలయ పనులపై సంతృ ప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన బాగుంది అని ఆయన కితాబిచ్చారు .ప్రపంచంలోని తెలుగు ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.