టీటీడీపీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు ఒక ప్రతి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపించాను అని చెప్పారు.
ఒకవేళ రేవంత్ రెడ్డి చేసిన రాజీనామా ఆమోదంపొందిన వెంటనే ఆరు నెలల్లోగా కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడం ఖాయం .ఇక్కడ నుంచి రేవంత్ ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటాడు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం ఏమి లేదు .అయితే కోడంగల్ టీడీపీ సిట్టింగ్ సీటు. ఈ పార్టీ నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ కొడంగల్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నదని కూడా అనుకుంటున్నారు.
రమణకు ఆ నియోజకవర్గంలో అత్తగారి ఊరు ఉంది. వారి పరంగా మంది బలం కూడా ఉంది. దీంతో ఇక్కడ ఉన్న పరిచయాలను వాడుకుని ఇక్కడ తాను బరిలోకి దిగితే గట్టిపోటీ ఇవ్వవచ్చన్నది రమణ ప్లాన్ అంట .చూడాలి మరి బాబు ఎవర్ని బరిలోకి దించుతారో ..?