తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా సభలో పంటలకు మద్దతు ధరపై మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని మాట్లాడకుండా.. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోత… ఎరువుల కోరత అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. సభను అడ్డుకోవడమంటే రైతులకు అన్యాయం చేయడమేనని మంత్రి అన్నారు.
దానికి ప్రతిగా జానారెడ్డి వారెందుకు వెళ్లారో.. వీరెందుకు వచ్చారో తమకు తెలుసు అంటూ పక్షపాత ధోరణితో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. దీంతో అసెంబ్లీ రూల్స్ ను బ్రేక్ చేసిన జానా రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.