Home / SLIDER / రేవంత్‌ను..కోదండ‌రాంను..వాయించేసిన మంత్రి కేటీఆర్‌

రేవంత్‌ను..కోదండ‌రాంను..వాయించేసిన మంత్రి కేటీఆర్‌

సముద్రాలు ఉప్పొంగి పోయి తెలంగాణకు వస్తాయి. రాహుల్‌ గాంధీ అంతర్జాతీయ నేత, రేవంత్‌ జాతీయ నాయకుడు అవుతారని అంటున్నారు’….ఇది  రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఏం జరుగనుందని బీబీసీ వంటి ప్ర‌ముఖ‌ జర్నలిస్టు వేసిన ప్ర‌శ్న‌కు మంత్రి కేటీఆర్ పంచ్ రిప్లై. మీడియా ప్ర‌చారంతో త‌మ‌ను తాము ఎక్కువ‌గా ఊహించుకుంటున్నార‌ని…కొంద‌రు వ్య‌క్తులు ఇది న‌మ్ముతున్నార‌ని వ్యాఖ్యానించారు. బీబీసీ తెలుగు చానల్‌తో లైవ్‌ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సదరు ఇంటర్యూలో జర్నలిస్టు రేవంత్‌ను గురించి అతిగా ప్ర‌స్తావించ‌డంతో మంత్రి కేటీఆర్ ఇలా రియాక్ట‌వ్వాల్సి వ‌చ్చింది.
ఈ సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ కోదండరాం గురించి కూడా మంత్రి కేటీఆర్ రియాక్ట‌య్యారు. “తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమఉజ్జి కోదండ‌రాం కాదు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌ తీర్చిదిద్దిన  వందలాది మందిలో ఆయన ఒకరు. కాంగ్రెస్‌ ఎజెండాలో భాగంగా కోదండరాం  మాట్లాడితే మేం ఏం చేయలేం. సభలు, సమావేశాలు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని అనడం సరికాదు. కొలువులు ఎక్కడిది? కొట్లాట ఎక్కడిది? ఆయనకో ఉద్యోగం కావాలని ఓ కొట్లాట. సభ పెట్టుకునే వరకు కనీసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ ఎజెండా ఉంటే…రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలి, ప్రజాక్షేత్రంలోకి వచ్చి తలపడాలి కానీ ఆరోపణలు సరికాదు’ అని అన్నారు.
కమల్‌ హాసన్‌ పొలిటికల్‌ ఎంట్రీ విషయంలో స్పందిస్తూ.. రాజకీయంగా తమిళనాడులో ఏం జరుగుతుందో నాకు తెలియదు… కాబట్టి నేను కామెంట్‌ చేయడం సరికాదు’ అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat