తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటు పార్టీ పదవులకు అటు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసి లేఖ సమర్పించాను అని మీడియాకు తెల్పిన విషయం కూడా తెల్సిందే .
ఇదే అంశం గురించి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను విలేఖర్లు అడిగారు .దీనిపై మంత్రి తలసాని స్పందిస్తూ నా రాజీనామా లేఖ స్పీకర్ వద్దే ఉంది .టీడీఎల్పీలో వీలినం అయిన తర్వాత రాజీనామా లేఖ అవసరం లేదు .ఎందుకంటే మెజార్టీ సభ్యులు పార్టీ మారితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు .అయితే రేవంత్ రాజీనామా లేఖ ఆమోదిస్తే ఎన్నికలు తప్పవని ..ఆ ఉప ఎన్నికల్లో తమ గెలుపు ఖాయం అని అన్నారు .