మల్కాజిగిరి కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. యువతుల నగ్న చిత్రాలతో వారిని మళ్లీ వేధించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్‌ను గతంలో ఇదే ఆరోపణలపై అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే అతడు మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని ఇద్దరు అమ్మాయిలు బెదిరించాడు. వారు బెదిరిపోకుండా రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.
