ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ మొదటి రోజు విజయవంతంగా ముగిసింది .ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. ఈ క్రమంలో ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు షెడ్యూల్‌ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆయన మంగళవారం పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా రెండో రోజు మొత్తం 12.6 కిలో మీటర్లు సాగే పాదయాత్ర నీలతిమ్మాయపల్లి సమీపంలో ముగియనుంది.
ప్రజా సంకల్పయాత్ర రెండో రోజు పూర్తి షెడ్యుల్ :
Sharing schedule of Day 2 of #PrajaSankalpaYatra pic.twitter.com/4Kc0fzQjW0
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 6, 2017