ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రని గ్రాండ్ ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజులో బాగంగా నిర్వమించిన బహిరంగ సబలో జగన్ స్పీచ్‌ని అదరగొట్టారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ బ్యాచ్‌కి దిమ్మతిరిగే షాక్ తగలనుందనే వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. విచారణ తేదీలను సుప్రీంకోర్టు త్వరలో ఖరారు చేయనుంది.
ఇక ఇప్పటికే ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఓటుకు కోట్లు వ్యవహారం జరిగి రెండున్నర సంవత్సరాలు అయినా.. తదుపరి పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని, ఏసీబీ దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయడం లేదని మొదటి ఛార్జిషీట్‌కు రెండో చార్జిషీట్‌కు వ్యత్యాసం ఉందని ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం తాజా ఆదేశాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారని, అయితే ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఆడియో టేపుల్లో మాట్లాడింది చంద్రబాబేనని రుజువైందని, ఆయన పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. దీంతో సుప్రింకోర్టులో ఆళ్ళ వేసిన కేసు ప్రకారం ఓటుకునోటు కేసును సిబిఐకి అప్పగిస్తే మొత్తం సీన్ మారిపోతుంది.. చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం మొదలైపోయింది. ఎందుకంటే, మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలకు ముందు గనుక సిబిఐ యాక్టివేట్ అయి కేసును విచారణలో వేగాన్ని పెంచితే.. ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యక్తిగతంగానే కాక టీడీపీకి కూడా ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.