ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో ప్రకటించిన మానిఫెస్టో తో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్ పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో …
Read More »ROJA: ప్రజలు లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారు: మంత్రి రోజా
ROJA: ప్రజలు నారా లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారని మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని ప్రజలే అతని చూసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే కాదు….పార్టీ కార్యకర్తలు , నేతలు కూడా అక్కడి నుంచి పారిపోతున్నారని విమర్శించారు. పాదయాత్రలో కనీసం 20 మంది కూడా లేరని….అది పెయిల్యూర్ యాత్ర అని రోజా మండిపడ్డారు. ప్రజలను అడిగితే వాస్తవాలు చెబుతారు గానీ….ఎవరో యాంకర్ ను పెట్టుకంటే …
Read More »KANNABABU: ఎల్లో మీడియా చాలా నీచ స్థితికి దిగజారిపోయింది: కన్నబాబు
KANNABABU: ఎల్లో మీడియా చాలా నీచ స్థితికి దిగజారిపోయిందని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈనాడు యాజమాన్యం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు ప్రజలకు తెలిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి నాటకం ఆడారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్టే ఈనాడు నడుచుకుంటోందని తెలిపారు. తెదేపా ప్రతిపక్షంలోకి వచ్చాక పట్టాభిరామ్ ను కావాలనే తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పైనా కావాలనే పెద్ద పెద్ద పేజీలు రాస్తున్నారని …
Read More »MINISTER CHELLUBOYINA: చంద్రబాబు విజన్ లేని వ్యక్తి: మంత్రి చెల్లుబోయిన
MINISTER CHELLUBOYINA: చంద్రబాబు….. సభల వల్ల 11 మందిని పొట్టనపెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ స్పష్టత లేదని మండిపడ్డారు. చంద్రబాబు అసలు విజన్ లేని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన ప్రతి పనిలోనూ కమిషన్ తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. ఇన్నేళ్లు ప్రజలను నాశనం చేసిన చంద్రబాబు…..ఇప్పుడు కార్యకర్తలను మోసం …
Read More »Political Fight : ఒకే వేదిక పైకి రానున్న సీఎం జగన్, చంద్రబాబు… ఎప్పుడంటే !
Political Fight : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య బూతు పురాణం కొనసాగుతోంది. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. గతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ను …
Read More »డౌట్ లేదు.. అది కూడా చంద్రబాబే కనిపెట్టి ఉంటాడు: వల్లభనేని వంశీ
టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …
Read More »ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ‘వైఎస్‌ఆర్ చేయూత’ నిధులు విడుదల కార్యక్రమంలో కుప్పంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేశ్ కుప్పంలో వీధివీధి తిరిగినా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపిని ప్రజలు ఓడించారని …
Read More »చంద్రబాబుకు వాళ్లిద్దరే గురువులు: మంత్రి బొత్స
టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం, విలువలు లేవని.. పండగ రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువలను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు …
Read More »చంద్రబాబు ఎదుటే కేశినేని నాని ఫ్రస్టేషన్!
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టారు. విజయవాడలో తన సోదరుడు కేశినేని శివనాథ్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారంటూ గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న కేశినేని నాని.. పార్టీ అధినేత ముందే తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలుకుతూ బొకేలు అందించి ఫొటోలు దిగారు. ఈ …
Read More »‘ఉమామహేశ్వరి సూసైడ్.. చంద్రబాబు వచ్చాకే ఆ లేఖ మాయం చేశారు’
ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు. ఆస్తి తగాదాలతో మానసిక వేదనకు గురిచేయడంతోనే ఉమామహేశ్వరి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని …
Read More »