నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1917 నవంబర్ 7 న అనగారిన తమ బ్రతుకులతొ విసుగు చెంది తమ హక్కులను నిలుపుకొవటానికి రష్యాలోని ప్రముఖ విప్లవకారుడు లెనిన్ ఆద్వర్యం లొ ప్రజలు భూమి – శాంతి – రొట్టే నినాదం తొ కదం తొక్కి నియంతృత్వ ప్రభుత్వం అయిన ప్రొవన్షియల్ ప్రభుత్వం ని కూలదొశారు. ఈ అక్టొబర్ విప్లవం ప్రపంచ దేశాలలొని కర్మిక కర్షక సామాన్య వర్గం కి స్పూర్తిగా నిలిచింది … ఆనాడు రష్యా లొని సామాన్య వర్గం ప్రొవన్షియల్ ప్రభుత్వం లొని విధానాల వలన ఎంత విసుగు చెంది ఒక భలమైన నాయకత్వం కొసం ఏదురు చూశారొ నేడు మన ఆంద్ర ప్రదేశ లొ కూడా సామాన్య ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం లొని తెలుగుదేశం పార్టి మొసపూరిత విధానాల వలన విసుగు చెంది తీవ్ర నిరాశలొ ఉండిపొయారు. మొసపొయిన యువత , దగపడ్డ రైతు, బద్రత లేని మహిళ.
ఇలా సమాజం లొ ప్రతి వర్గం చంద్రబాబు పాలన లొ భాదితులే.. ఆనాడు లెనిన్ భాదితుల పక్షం నిలబడి ఎలా విప్లవం నడిపారొ నేడు ఆంద్రప్రదేశ్ లొ కూడా ప్రభుత్వం సాగిస్తున్న నియంతృత్వ విధానాలకి వ్యతిరేకంగా మొసపొయిన ప్రతి వ్యక్తి ని కలుపుకుంటు వై.యస్ జగన్ గారు ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతొ శాంతియుత విప్లవం కి నాంది పలికారు ….నేడు ఏపీ లో చంద్రబాబు ప్రభుత్వం లొ ధగా పడ్డ ప్రతి వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులొ అడుగు వేస్తు జయ జయ ధ్వానాల తొ ముందుకు కదులుతున్నారు, మిడియా అండతొ సాగిస్తున్న గొబెల్స్ ప్రచారం , నియతృత్వ పొకడులని మేము సహించం అని బిగ్గరగా అరిచి మరీ చెబుతున్నారు.
చరిత్ర చూసుకుంటే తరతరాలుగా బిగ్గరగా నినదించిన ప్రతి సామాన్యుడు గొంతు వెనక ఒక భలమైన నాయకుడు అండగా ఉన్నాడు , నేడు కూడా రాష్ట్రం లొ నియంత పాలనని తలపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ని ప్రశ్నిస్తున్న ప్రతి గొంతుకకు జగన్ అనే బలమైన అండ తొడు అయింది … ఆనాడు రష్యాలొ అక్టొబర్ విప్లవం పేరు తొ ప్రొవన్షియల్ ప్రభుత్వం ని లెనిన్ అండతొ ప్రజలు ఎలా కూల్చారొ నేడు ఆంద్రప్రదేశ లొ కూడా జగన్ ఆద్వర్యం లొ ప్రజలు ప్రజాసంకల్ప పాదయాత్ర లొ అడుగు కలుపుతూ తెలుగుదేశం ప్రభుత్వం ని కూల్చటానికి సిద్దం అయ్యారు . ఎన్ని తరాలు మారినా నియతృత్వం కి అయిషు తక్కువ అని మరికొన్ని రొజులలొ రాష్ట్ర ప్రజలు నిరూపించబొతున్నారు..ఎప్పటికైనా సామాన్య ప్రజలే బలవంతులు అని గుర్తుపెట్టుకొవాలి. జగన్ తొ మొదలైన ఈ ఒక్క అడుగు రాష్ట్రం లొ మరొ అక్టొబర్ విప్లవం కాబొతుంది..అంటూ Sarat Kumar Dasari అనే నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది .