దేశంలో నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బ తీసిందని.. దీన్ని వల్ల దేశానికి పెద్దగా ఉపయోగం లేకపోగా సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిగిందనీ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డీ,కాంగ్రేస్ నేతలు ఓబేదుల్లా కోత్వాల్,వెంకట్ రాంరెడ్డీ అన్నారు.నోట్ల రద్దు జరిగి ఏడాది గడుస్తున్న రోజును కాంగ్రేస్ బ్లాక్ డే గా పాటించింది.మహబూబ్ నగర్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డీ మాట్లాడుతూ.. మోదీ మాటలను నమ్మారనీ నోట్ల రద్దుతో అసలు ఏం జరిగింది? మోదీ ఏం చెప్పారు? ఏం జరుగుతోందనీ ప్రశ్నించారు. దేశానికి మేలు జరిగిందా? కీడు జరిగిందా? అంటూ దేశ వాస్తవ పరిస్థితులు ఏం చెబుతున్నాయనీ ప్రశ్నించారు.
మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దారుణం అన్నారు. అవినీతి అంతం, బ్లాక్ మనీని అరికట్టడానికి, టెర్రరిస్టులకు నగదు అందకుండా చేయటం వంటివి ప్రధానమైనవిగా ప్రధాని ప్రజలకు చెప్పారు. కానీ నిజానికి దానికి విరుద్దంగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. బ్లాక్ మనీ లక్షల కోట్లు ఉంటుందని అంచన వేసి విఫలం అయ్యిందని, ఈ నోట్ల రద్దుతో ఇవి డివిడెండ్ల రూపంలో ప్రభుత్వం దగ్గరకు వస్తుందని భావించారు. కానీ అలా జరగలేదన్నారు.నోట్లు రద్దు చేసే సమయానికి 14. 64 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉంటే 1 శాతం మినహా మిగిలిన వన్నీ కూడా బ్యాంకులకుచేరిపోయాయనీ,అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిందనీ 1 శాతం విలువ అంటే 16 వేల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చేరలేదనీ అంటే మోదీ చెప్పిన దానికి రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన వాస్తవ పరిస్థితి ఏ మాత్రం పొంతన లేదని తేలిపోయిందన్నారు.
బ్లాక్ మనీ నోట్ల రద్దుతో అరికట్టలేరని నిజం నిరూపణ అయిందనీ అన్నారు.ఇక అవినీతి విషయానికి వస్తే నిరంతర నిత్యావసర సరుకుల ధరలు ఏవిధంగానైతే పెరిగిపోతున్నాయో అవినీతి కూడా అలాగే పెరుగుతుంది తప్ప అవినీతి ఏ కోశాన తగ్గలేదనీ విమర్శించారు. అవినీతి పునాది వ్యవస్ధీకృతమై పోవటం వల్ల ఇటువంటి పైపై నిర్ణయాల వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదనీ, ఎన్నికల్లో ఓటు రేటు పెంచేసి సులువుగా పంపిణీ చేసుకోవటానికి మోదీ ప్రవేశ పెట్టిన రూ. 2000 రూపాయల నోటు ఉపయోగం పడిందనీ ఎద్దేవా చేశారు.పేదలను సామాన్యులను బలి పశువులు చేశారని ప్రతాప్ రెడ్డీ కేంద్రం పైన విరుచుకుని పడ్డారు.