ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక మీడియాలో అయితే జగన్ పాదయాత్ర పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక జగన్ పాదయాత్ర పై వస్తున్న విశేష స్పందన చూసి చంద్రబాబు అండ్ బ్యాచ్ జగన్ పై విష ప్రచారం చేయడానికి పూనుకున్నారు.
ఇప్పటికే టీడీపీ అనుకూల పచ్చ మీడియా ఆ కార్యక్రమాన్ని తమ తమ భుజాల పై వేసుకోగా.. తోక మీడియా కూడా అనుసరిస్తోంది. అందులో భాగంగానే జగన్ పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజే ప్యారడైజ్ లీక్స్‌లో జగన్ పేరు ఉందంటూ బురద జల్లుడు కథనాలు ప్రచురించింది. మరో వైపు అదే విషయం పై ఈనాడు సైతం జగన్ ప్రస్తావన మాత్రమే ఉందని ప్రచురించి చంద్రబాబు బ్యాచ్‌కి షాక్ ఇచ్చింది.
ఇక రెండవరోజు పాదయాత్రలో భాగంగా నిర్వహించిన రచ్చబండ ప్రోగ్రాంలో అవ్వకి షాక్ ఇచ్చిందంటూ మరోసారి జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేసింది.. ఓ దమ్ములేని వార్తలు రాసే ప్రముఖ పత్రిక. తీరా అక్కడ జరిగిన విషయం వీడియో చూస్తే ఛీ..ఛీ జగన్ అంటే అంత కుళ్ళా అనేవిధంగా ఉంటుంది అక్కడ జరిగిన సంఘటన చూస్తే.. అలా జగన్ పై ఎంత పచ్చ ప్రచారం చేసినా.. జగన్ మాత్రం జనంలోకి దూసుకుపోతున్నారు.
దీంతో ఏం లాభం లేదనుకున్న టీడీపీ బ్యాచ్ నుండి నోటి దూల పోటుగాడు బయటకి వచ్చి వ్యాఖ్యలు చేయండం మొదలు పెట్టాడు. నిరంతరం జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మరోసారి జగన్ పై నోటిదూల ప్రధర్శించి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించాడు.
జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. జగన్‌ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని.. జగన్ పాదయాత్ర చేస్తోంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదని.. సీఎం కుర్చీ కోసమేనన్నారు. అంతే కాకుండా చంద్రబాబు ఏపీని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నాడని.. జగన్ వల్ల ఏపీ పరువు పోతోందని బోండా ఉమా దిక్కుమాలిన కూతలు కూశారు.
దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బోండా పై విరుచుకుపడుతున్నారు వైసీపీ అభిమానులు. జగన్‌ది ఫ్యాక్షన్ మనస్తత్వమా.. ఎవరి అధికారంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయో జనాలకి తెలియదనుకుంటున్నాడా.. ఇంకేటి జగన్ పాదయాత్ర చేస్తోంది సీయం కుర్చీ కోసమా.. మరి చంద్రబాబు పాదయాత్ర చేసింది కటింగ్ చెయిర్ కోసమా… ఏంటీ జగన్ వల్ల రాష్ట్రం పరువు పోతుందా.. అయ్యా బోండా బాబు..టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు దాటినా.. భ్రమరావతిలో రాజధాని గ్రాఫిక్స్ ప్రపంచం మొత్తం చూస్తోందని.. అసలు మీ బుర్రతక్కువ బ్యాచ్ ఏపీ పరువు ఎప్పుడో గంగలో కలిపేశారని బోండాను ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు.