ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ రోజు 16.2 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. ఉరుటూరులో ఈరోజు యాత్ర ముగించనున్నారు.సోమవారం వైఎస్సార్ జిల్లాలో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన వైఎస్ జగన్ మొదటి రోజు 10 కిలోమీటర్లు, రెండో రోజు 12.8 కిలోమీటర్లు నడిచారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యాత్ర కొనసాగించారు.
