వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ నియోజకవర్గంలో గెలవకపోతే రాష్ట్రంలో ఇక తిరగలేనని కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ … వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డికి అంత సీన్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులకు అండగా ఉంటామని, త్వరలో ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అనారోగ్యం బారిన పడిన అనాథ శిశువులను హైదరాబాద్‌కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.
