గత ఏడాది ఇదే నెల ఎనిమిదో తారీఖున ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. అయితే అప్పట్లో ఎవరికీ ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు తీసుకొస్తున్నామని మోదీ ఏకంగా చెప్పేశారు.దేశంలో పేరుకుపోయిన అవినీతి నిరోధం, ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట, నకిలీ కరెన్సీ నిరోధం, ప్రజా సంక్షేమం వంటి మహత్తర లక్షాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మోదీ అన్నారు .
అంతటి మహా ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని విశ్లేషించి చూస్తే ఈ లక్ష్యాల సాధనలో పూర్తిగా విఫమైనట్టేనని అర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.నోట్ల రద్దు తర్వాత అవినీతి తగ్గకపోగా బాగా పెరిగింది. నల్ల నోట్లను తెల్లగా చేసుకోవడానికి బ్యాంకులు అండదండలుగా నిలిచాయి. లక్ష కోట్ల డబ్బు తెల్లగా మారిపోయింది. రద్దు చేసిన నోట్లన్నీ దాదాపు బ్యాంకులకు తిరిగొచ్చాయని కేంద్రమే చెప్పింది. మరి అదంతా తెల్ల డబ్బు అయితే నల్ల డబ్బు ఏమైపోంది? నల్లడబ్బే లేకపోతే నోట్ల రద్దు వల్ల ఒరిగిందేమిటి? ఇదొకటైతే.. నల్ల డబ్బును తెల్లగా మార్చుకున్న కేసుల్లో నిందితులపై చర్యల్లేవు. అవినీతి కేసులు కూడా పెరిగాయి.
బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడి ఆస్తి 80 వేల రెట్లకు పెరిగిందని ఓ విలేకరి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. నోట్ల రద్దుతో సంబంధం లేకుండా బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు కోట్లకొద్దీ విరాళాలు వచ్చి పడ్డాయి. మరోపక్క.. కొత్త నోట్ల కోసం క్యూల్లో గంటల తరబడి నిలబడ్డారు జనం. 200 మందికిపైగా క్యూల్లోనే అసువులు బాశారు. రూ. 2వేల నోట్లకు చిల్లర దొరక్క నానా అవస్థలూ పడ్డారు.అయితే నోట్ల రద్దు వల్ల ఐటీ రిటర్నులు పెరిగాయి. ఉగ్రవాద నిధులకు కూడా కాస్త అడ్డుకట్ట పడింది. డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. అయితే దేశ జనాభాలో అత్యధికశాతం మందికి వీటి వల్ల తక్షణ ఫలితం లేకపోయింది. అవినీతి అంతం, ఉద్యోగాల కల్పన, అందుబాటు ధరల్లో నిత్యావసరాలు, మెరుగైన
విద్య, ఆరోగ్యం వంటివేవీ నోట్ల రద్దుతో సాధ్యం కాలేదు.