Home / SLIDER / త్వ‌ర‌లో మ‌రో 8వేల టీచ‌ర్ ఉద్యోగాలు..క‌డియం

త్వ‌ర‌లో మ‌రో 8వేల టీచ‌ర్ ఉద్యోగాలు..క‌డియం

వ‌చ్చే ఏడాది మ‌రో 8వేల టీచ‌ర్ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శాసనసభలో తెలిపారు. ఉపాధ్యాయుల ఖాళీలు- భర్తీపై సభ్యులు గ్యాదరి కిషోర్, వంశీచందర్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, అక్బరుద్దీన్, కిషన్ రెడ్డి ,శ్రీనివాస గౌడ్, సున్నం రాజయ్యలు అడిగిన వివిధ సందేహాలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేసే విధంగానే నోటిఫికేషన్ ఇచ్చామని ఆయ‌న వివ‌రించారు.

వివిధ పార్టీ సభ్యులు చెప్పినట్లు రాష్ట్రంలో 50వేలు, 40వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేవన్నారు. పత్రికల్లో రావడానికో, బయట ఉన్నవారు వినడానికో మాట్లాడితే తాను ఏం చేసేది లేదని ఎద్దేవా చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 1,22,955 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 1, 09,256 పోస్టుల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. 13,699 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు 8792 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 8792 పోస్టులను డైరెక్టుగా నియామకం చేయడం వల్ల 13,699 పోస్టుల్లో మిగిలినవి పదోన్నతుల ద్వారా భర్తీ అవుతాయన్నారు. అందుకే పదోన్నతుల పోస్టులను పక్కన పెట్టడం వల్ల 8792 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందని ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం తెలిపారు.

ఇక అన్ని పోస్టుల భర్తీని 10 జిల్లాల ఆధారంగా ఇచ్చి టీచర్ పోస్టుల నోటిఫికేషన్ 31 జిల్లాల ప్రకారం ఇవ్వడంలో కోర్టుల్లో ఈ నోటిఫికేషన్ ఆగాలనే వేశారా అన్న సభ్యులు వంశీ చందర్ రెడ్డి ప్రశ్నపట్ల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన నోటిఫికేషన్ కి హైకోర్టు ఆమోదం తెలిపింది అని గుర్తు చేశారు. అయినా ఈ నోటిఫికేషన్ ను కోర్టులో ఎందుకు ఆపలేకపోయామన్న బాధ కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు ఉందేమోనని ఎద్దేవా చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేస్తే…ఇప్పుడు31 జిల్లాలకు టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వెనుకబడిన, ఏజన్సీ జిల్లాలకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు వచ్చాయని, అక్కడి నిరుద్యోగులకు అవకాశం లభించిందని ఉప ముఖ్య‌మంత్రి  తెలిపారు.

ఉర్దూ మీడియం పోస్టులు కేవలం 900 మాత్రమే భర్తీ చేస్తున్నారన్న అక్బరుద్దీన్ ప్రశ్నకు స్పందిస్తూ ఈ నోటిఫికేషన్ తర్వాత ఇంకా పోస్టులు మిగిలితే వారికి ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు క్యారిఫార్వార్డ్ అవుతాయన్నారు. ఉర్దూ పోస్టులపై 2,3 రోజుల్లో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏజెన్సీ ఏరియా లో కూడా ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. 2014 కు ముందు డి.ఎస్సి కి అర్హత సాధించిన వారికి కూడా ఈ నోటిఫికేషన్ లో అవకాశం కల్పించామని సభ్యలు గ్యాదరి కిషోర్ ప్రశ్న కు సమాధానం ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల విద్యనే స్థానికత కు ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కిషోర్ అడిగిన దానికి సమాధానంగా ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం తెలిపారు.

రాష్ట్రంలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ నోటిఫికేషన్ కు ఎదురు చూస్తుంటే 8792 పోస్టులే వేశారన్న సభ్యుడికి సమాధానంగా ఎంత మంది ఎదురు చూస్తే అంత మందికి ఉద్యోగాలిచ్చే నోటిఫికేషన్ ఇవ్వరని, అవసరాన్ని బట్టి పోస్టులను భర్తీ చేస్తారని చెప్పారు. 11,428 మంది విద్యా వలంటీర్లను నియమించుకొని కేవలం 8792 పోస్టులే ఎందుకు నోటిఫై చేసారన్నదానికి స్పందిస్తూ ఈ 11,428 విద్యా వలంటీర్ల నియామకంలో డైరెక్ట్ పోస్టులతో పాటు, పదోన్నతి ద్వారా నింపేవి కూడా ఉన్నాయన్నారు.

విద్య పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎవరికి లేదన్నారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బలహీన వర్గాల బిడ్డలకు ఉపయోగ పడాలనే ఉద్దేశ్యంతో 544 గురుకులాలు ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వం జూనియర్, డిగ్రీ కాలేజీలు ఇచ్చి అక్కడ నిధులు, పోస్టులు, మౌలిక సదుపాయాల ఇవ్వడం మరిచిందని, ఇప్పుడు తాము ఇస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో 8000 పోస్టులతో వచ్చే ఏడాది మరొక నోటిఫికేషన్ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గౌరవ స్పీకర్ విద్యపై లఘు చర్చకు అనుమతిస్తే సభ్యులు కోరినట్లు అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. దీనికి గౌరవ స్పీకర్ మధుసూదనాచారి స్పందించి విద్యపై లఘు చర్చ కు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat