తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాలని ఆకాంక్షించిన టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరికలకు ముందు హామీ ఇచ్చినట్లు పదవి కట్టబెట్టకపోగా…మరోవైపు ఆయన గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది. ఎక్కడ తట్టుకుంది. స్పీకర్ అయితే.. రాలేదన్నారు. రేవంత్.. ఆట మొదలయింది అన్నడు. ఎక్కడ పోయాడు?’అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంపత్‌ను ప్రశ్నించారు. దీంతో ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాక బిక్కమొహం వేయడం సంపత్ వంతైంది ..
