ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ప్యారడైజ్ లీకేజ్ విమర్శలపై స్పందిస్తూ దమ్ముంటే పది హేను రోజుల్లో నిరూపిస్తే తను రాజకీయ సన్యాసం చేస్తాను ..చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాలు విసిరిన సంగతి విదితమే .అయితే జగన్ బాబుకు విసిరిన సవాలుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు .ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు జగన్ విసిరిన సవాల్ కు తాము స్పందించాల్సిన అవసరం లేదు . ఆయన సవాల్ కు స్పందించి తమ స్థాయిని తగ్గించుకోలేమని అన్నారు. జగన్ అవినీతిపై పేపర్లలో రాయించాల్సిన అవసరం తమకు లేదు .జగన్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని అని అయన అన్నారు అన్నారు.
