ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు .
వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఏకమై ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కు దమ్ము చూపించాలి .రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీను గెలిపించి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు .జగన్ పాదయాత్రలో భాగంగా ఏడో రోజు వైఎస్సార్ కడప జిల్లాలో కానగూడురు కు చేరింది .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ యావత్తు భారతదేశంలో బీసీలకు అండగా ఉన్న్నది ఒక్క వైఎస్సార్ ,ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు .వైఎస్సార్ హయంలోనే బీసీ యువతకు ఫీజ్ రియింబర్స్ మెంట్ వలన లాభం జరిగింది .ఆయన ఋణం తీర్చుకునే అవకాశం బీసీలకు వచ్చింది .ఈ తరుణంలో బీసీలు జగన్ కు అండగా నిలబడాలని ఆయన అన్నారు .