సీపీఐ నేత నారాయణ కుటుంబంలో విషాదం అలముకుంది. నిన్న విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఆయన సోదరి మృతి చెందారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో ప్రయాణించారు. సంగమం వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించగా, ఆమె కోడలు, మనవరాలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం నారాయణ భార్య, పలువురు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న కృష్ణా-గోదావరి సంగమం వద్ద బోటు తిరగబడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
