Home / SLIDER / ఈ చిన్నారికి ఫిదా అయిన ” మంత్రి కేటీఆర్ “

ఈ చిన్నారికి ఫిదా అయిన ” మంత్రి కేటీఆర్ “

ఇవాళ ( నవంబర్‌ 14) న పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టిన రోజును మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు తమ ఫ్యాన్సీ డ్రస్సులతో అందరి చూపు వారిపై ఉండేలా చేశారు. ఓ చిన్నారి మంత్రి కేటీఆర్‌లా డ్రస్‌ వేసి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్సీ డ్రస్సు ఈవెంట్‌లో చిన్నారులు రకరకాల దుస్తులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  భాగంగా పిల్లలు మోడ్రన్‌గా రెడీ అయి ఈవెంట్‌కు హజరయ్యారు.కానీ రెండేళ్ల పాప ఐరా కేటీఆర్‌లా దుస్తులు వేసుకుని బాలల దినోత్సవ వేడుకలకు వచ్చింది.

అంతేకాక మెడలో గులాజీ రంగు టీఆర్‌ఎస్‌​ పార్టీ కండువాను, కేటీఆర్‌ పేరు ఉన్న కార్డు కూడా వేసుకుంది. చూడముచ్చటగా ఉన్న బుజ్జాయి ఫొటోలను తల్లిదండ్రులు మంత్రికి పంపించారు. ఆ ఫొటోలను కేటీఆర్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ‘ ఆ చిన్నారి ఫొటోలు నా మనసుకు ఎంతగానో హత్తుకున్నాయి. ఆ పాప తల్లిదండ్రులకు ధన్యవాదాలు’ అంటూ తన అకౌంట్‌ కేటీఆర్‌ ట్విట్‌​ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat