వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దాదాపుగా వంద కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటికే జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ నేతల గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. దీంతో కలుగులో నుండి ఒక్కో ఎలుక బయటకి వచ్చినట్టు.. ఒక్కొకరుగా టీడీపీ నేతలు బయటకు వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక తాజాగా నోటి దూల మాస్టర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ దృష్టి అంతా సీఎం పదవి మీదే ఉందని.. అతనొక తిక్కలోడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా ఎక్కడ ఏముందో అన్ని వివరిస్తుంటే కొత్తగా పాదయాత్రతో తెలుసుకునేది ఏంటని జగన్ పై సెటైర్లు వేశారు జేసీ.
అంతటితో ఆగకుండా ఏపీ మంత్రుల పై కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న మంత్రులకు వెన్నెముక లేదని వ్యాఖ్యానించారు. మంత్రుల పవర్ మా టైంతోనే పోయిందని ఎంపీ జేసీ ఉద్ఘాటించారు. దీంతో జగన్ పై జేసీ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ వర్గీయులు మండి పడుతున్నారు. ఇక జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు టీడీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నజగన్ జేసీ చేసిన వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తారో చూడాలి.